Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాంగ్రెస్ ఓటమిలో బి జె పి గెలుపు

కాంగ్రెస్ ఓటమిలో బి జె పి గెలుపు

Congress Debacle:
ఏది ఏమైనా గెలుపు ఇచ్చే కిక్కే వేరు.
ఒకటి కాదు రెండు కాదు… మూడు రాష్ట్రాల్లో గెలవడం,
మూడు రాష్ట్రాల్లోనూ రెండో సారి గెలవడం..మామూలు విషయం కాదు.
నిజంగా కాషాయజెండా పొగరుగా రెపరెపలాడాల్సిందే..
మోడీ,అమిత్షా, యోగి త్రయం ఆనందంతో తబ్బిబ్బవ్వాల్సిందే.
హిందుత్వవాదులంతా ఇక దేశంలో తమకి తిరుగులేదని అనుకోతగిందే.
టీవీ స్క్రీన్ల మీదా, సోషల్ మీడియా వేదికల మీదా ఆ సంబరం కనిపిస్తోంది.
కాంగ్రెస్ పని అయిపోయిందని చరమగీతాలు పాడుతున్నారు.
ప్రాంతీయపార్టీలూ! ఖబడ్దార్ అని వార్నింగ్ లు ఇస్తున్నారు.
దేశమంతా ఇక కాషాయమే అని కలల్లో తేలియాడుతున్నారు.
బిజెపి వినా వేరే దిక్కు లేదని లెక్కలేస్తున్నారు.
గెలిచినప్పుడు ఏమైనా చెప్పొచ్చు.
ఓడిపోయిన వాళ్ళ లాజిక్ ను పట్టించుకునేవాడెవడు?.
మేధావి అనేది తిట్టుగా మారిన దేశంలో హేతువుకి విలువిచ్చేదెవడు?
ఇన్ని విజయాల తర్వాత కూడా మోడీ అజేయుడేం కాడని చెప్తే వినేదెవడు?
చెప్పడానికి వినడానికి ఎలా వున్నా వాస్తవమదే.
ఈ పొంగు చల్లారాకైనా అసలు నిజం చూడాల్సిందే.


సరిగ్గా పదేళ్ళ క్రితం కాంగ్రెస్ కూడా ఇంతే అజేయంగా కనిపించింది.
దేశంలో 13రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో వుండేది.
అయితే, అక్కడి నుంచే పార్టీ పతనం కూడా మొదలైంది.
వరుస స్కాములు,
సో్నియా అనారోగ్యం
పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహూల్ కి పగ్గాలు రావడం,
వీటన్నిటి ఫలితంగా 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి గెలవడం.
ఇక ఆ తర్వాత కాంగ్రెస్ కోలుకోలేదు.
రాహూల్ నాయకత్వం లోపం కావచ్చు.,
రాష్ట్ర పార్టీల్లో క్రమశిక్షణారాహిత్యం కావచ్చు.
దాన్ని సరిదిద్దే వ్యవస్థ అధిష్టానం దగ్గరలేకపోవడం కావచ్చు.
కారణాలేమైనా పదేళ్ళక్రితం పదమూడు రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీ, ఇప్పుడు
రెండు రాష్ట్రాలకు పరిమితమైంది.


కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జనం కాంగ్రెస్ ని ఛీకొడుతూ వచ్చారు.
ఆ ఛీత్కారాలనే బిజెపి బలంగా మార్చుకుంటూ వచ్చింది.
గుజరాత్, ఉత్తరప్రదేశ్ కాకుండా బిజెపి అధికారంలో వున్నవన్నీ అయితే చిన్నరాష్ట్రాలూ,
లేదా దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు.
జ్యోతిరాదిత్య సింధియా వర్గాన్ని చీల్చి మధ్య ప్రదేశ్ లో  అధికారంలోకి వచ్చింది.
17మంది కాంగ్రెస్,జెడిఎస్ ఎమ్మెల్యేలని “ఆకర్షించి” కర్ణాటకలో అదికారంలోకి వచ్చింది.
రెండేస్థానాలు గెలిచిన మేఘాలయాలో స్థానిక పార్టీలతో కలిసి ప్రభుత్వంలోకి వచ్చింది.
గత ఎన్నికల్లో కూడా గోవాలో కాంగ్రెస్ కే అత్యథిక సీట్లున్నా ఎమ్జిపి మద్దతుతో
అధికారంలోకి వచ్చింది.
ఈసారి కూడా బయటి నుంచి మద్దతు తప్పదు.
మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో కూడా గతంలో ఇలాంటి గిమ్మిక్కులతోనే
అధికారంలోకి వచ్చి, ఈ సారి మెల్లగా పాతుకుపోయింది.
రాజస్థాన్ లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేదు.


అయితే, రాజ్యం వీరభోజ్యం.
కాంగ్రెస్ ప్రభుత్వాలని కూల్చినందుకు బిజెపిని రాజకీయంగా తప్పుపట్టలేం.
గతంలో కాంగ్రెస్ కూడా ఇలాంటివి చేసే ఎదిగింది.
ఇప్పుడు బిజెపి వంతు .. అంతే,
గెలిచిన ప్రభుత్వాలను నిలబెట్టుకోలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యమే అనుకోవాలి .
మొత్తంగా ఈ పరిణామాలన్నీ చూస్తే, బిజెపి ఉనికి కాంగ్రెస్ వైఫల్యాల్లోనే వుందని అర్థమవుతుంది.
కాంగ్రెస్ లేని చోట్ల, కాంగ్రెస్ కు బలమైన ప్రత్యామ్నాయం వున్నచోట్ల బిజెపి బలం, మోడీ మేజిక్ పనిచేయలేదు.
ఢిల్లీ నుంచి కేరళ వరకు ఎనిమిది మంది ముఖ్యమంత్రులు మోడీ హవాను తట్టుకునే అధికారంలోకి వచ్చారు.
ఇటు ఢిల్లీలోనూ, అటు పంజాబ్ లోనూ బిజెపిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు కేజ్రీవాల్.
బెంగాల్లో బిజెపి సర్వశక్తులనూ ఒడ్డినా మమతని ఓడించలేకపోయింది.
బీహార్ లో ఇప్పటికీ నితీష్ మీద ఆధారపడాల్సిందే.


తెలంగాణలో కేసిఆర్ దెబ్బకి బిజెపిఒక్క సీటుకి పడిపోయింది. (తర్వాత ఉప ఎన్నికల్లో మరో రెండు గెలుచుకుంది.)
ఆంధ్రప్రదేశ్ లో అయితే, జగన్ హోరులో ఆ ఒక్కటి కూడా దక్కలేదు.
తమిళనాడు ఎఐఎడిఎమ్ కే రాజకీయాల్లో తలదూర్చి 4 స్థానాలతో సరిపెట్టుకుంది.
కేరళలో పినరాయి విజయన్ విజయాన్ని అడ్డుకోవడం కాదు కదా.. కనీసం బోణి కూడా కొట్టలేకపోయింది.
మోడీ ప్రధాని అయ్యాకే ఈ ఎనిమిది రాష్ట్రాల్లోనూ ఎన్నికలయ్యాయి.
అయినా అక్కడ మోడీ వేవ్ కానీ, బిజెపి ప్రభంజనం కానీ ఏమాత్రం పనిచేయలేదు.
ఈ మొత్తం లెక్కలు కాస్త సావకాశంగా అలోచిస్తే అర్థమయ్యేది ఒక్కటే.
మోడీ అజేయుడు కాదు. బిజెపి తిరుగులేని శక్తి కాదు. కాంగ్రెస్ వైఫల్యమే బిజెపి బలం.

Rahul Congress Failures
బలమైన ప్రత్యామ్నాయాలు., ప్రాంతీయ శక్తులూ వున్నచోట బిజెపి అడుగు కూడా పెట్టలేదు.
అలాగని పార్లమెంటు ఎన్నికల్లో మోడీని తక్కువ అంచనా వేయడానికి లేదు.
జాతీయ స్థాయిలో మోడీ దరిదాపుకి రాగల చరిష్మా వున్న మరొక నేతలేడు.
ఢిల్లీలో చక్రం తిప్పుతామని బయల్దేరిన వాళ్ళు కూడా ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల
ఫలితాల తర్వాత ఆ చక్రాలని మూలనపడేసి సొంతపనులు చూసుకోవచ్చు.

-శివప్రసాద్

Also Read :

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్