Monday, May 5, 2025
Homeస్పోర్ట్స్కెఎల్ రాహుల్, కులదీప్ ఔట్- కెప్టెన్ గా పంత్

కెఎల్ రాహుల్, కులదీప్ ఔట్- కెప్టెన్ గా పంత్

Panth to lead: సౌతాఫ్రికాతో  టి 20 సిరీస్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఇండియా జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యారు. రాహూల్ స్థానంలో కెప్టెన్ గా రిషభ్ పంత్ ను బిసిసిఐ ఎంపిక చేసింది.

ఐదు మ్యాచ్ ల టి 20 సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. రేపు జూన్ 9న మొదటి మ్యాచ్ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత 12, 14, 17,19 తేదీల్లో కటక్, విశాఖపట్నం, రాజ్ కోట్, బెంగుళూరు ల్లో జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం 18 మందితో కూడిన జట్టును బిసిసిఐ రెండు వారాల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.  కాగా, తొలి మ్యాచ్ కు ముందురోజు రాహుల్, కుల్దీప్ దూరం కావడంతో వారి స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. మిగిలిన 16 మందితోనే జట్టు కొనసాగుతుంది. కాగా, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించారు.

Also Read : తొలి టి 20లో లంకపై ఆసీస్ ఘనవిజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్