కెఎల్ రాహుల్ మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ఆగస్ట్ 18నుంచి జింబాబ్వే తో జరిగే మూడు వన్డేల సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే శిఖర్ ధావన్ సారధ్యంలో 15మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసిఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ తరువాత ఇప్పటి వరకూ ఏ సిరీస్ లోనూ ఆడని రాహుల్ కు ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని భావించిన బిసిసిఐ అతన్ని జింబాబ్వే పంపాలని నిర్ణయించింది. జట్టు సారధ్య బాధ్యతలు కూడా అప్పగించింది. ధావన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
రాహుల్ రాకతో జట్టు సభ్యుల సంఖ్య 16కు చేరింది. రుతురాజ్ గైక్వాడ్ కు తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు సన్నగిల్లాయి.
ఆగస్టు 18, 20, 22 తేదీల్లో హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మూడు వన్డే మ్యాచ్ లూ జరగనున్నాయి.
Also Read : ఆసీస్ క్రికెట్ టీమ్ ఔదార్యం