Saturday, January 18, 2025
Homeసినిమా'రాజమండ్రి రోజ్ మిల్క్' టైటిల్ సాంగ్ విడుదల

‘రాజమండ్రి రోజ్ మిల్క్’ టైటిల్ సాంగ్ విడుదల

జై జాస్తి, అనంతిక జంటగా  సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్,  ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి  నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్రం బృందం తాజాగా ఈ చిత్రం టైటిల్‌సాంగ్‌ను  విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ… ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచించిన నువ్వే ముద్దుగా నవ్వే నవ్వగా.. ఉండే నిండుగా.. ఫస్ట్‌డే ఫస్ట్ షో చూసినట్టుగా అనే సాంగ్‌ను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అజయ్ అరసాడ సంగీత బాణీలు అందించిన ఈ సాంగ్‌ను నేడు విడుదల చేశాం. పాటకు అందరి నుంచి మంచి స్పందన వస్తోంది.  పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి  కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్