Saturday, January 18, 2025
Homeసినిమారాజమౌళి.. ఇది నిజమా..?

రాజమౌళి.. ఇది నిజమా..?

మహేష్‌ బాబు, రాజమౌళిల కాంబినేషన్లో ఈ భారీ పాన్ ఇండియా మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. జనవరిలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు కానీ.. సమ్మర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మహేష్ తో సినిమా అని రాజమౌళి ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీ అప్ డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఆఫ్రికా అడవుల్లో అత్యంత డేంజరస్ నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా రాజమౌళి ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నారు. సినిమా ఇంకా సెట్స్ పైకి రాకుండానే రోజుకో వార్త వస్తూనే ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పుకార్లు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ఏంటంటే.. రాజమౌళి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం ఆఫ్రికా అడవుల్లో పచ్చి మాంసం తినే కొందరు మనషులతో ఫైట్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నాడట.

ఆ అడవి మనుషులతో మహేష్ చేసే యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్స్ టీమ్ ను రంగంలోకి దించే ఉద్దేశ్యంతో జక్కన్న ఉన్నాడట. సినిమా షూటింగ్ మొత్తం ను ఆఫ్రికా అడవుల్లో నిర్మించడం అనేది కష్టమైన విషయం. కనుక ఆఫ్రికా అడవులను రాజమౌళి హైదరాబాద్ లో పెంచే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడంతో జక్కన్నా.. ఇది నిజమా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై జక్కన్న క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : మహేష్-రాజమౌళి మూవీలో నాగ్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్