Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్‌, రాజ‌మౌళి మూవీలో కోలీవుడ్ స్టార్..?

మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీలో కోలీవుడ్ స్టార్..?

మ‌హేష్ బాబు, రాజ‌మౌళి ల కాంబినేష‌న్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొంద‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై డా.కె.ఎల్. నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ భారీ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. అయితే…’ బాహుబ‌లి’, ‘బాహుబ‌లి 2’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల‌తో విదేశాల్లో సైతం సంచ‌ల‌నం సృష్టించ‌డంతో రాజ‌మౌళి మ‌హేష్ తో చేయ‌నున్న మూవీ

మ‌హేష్ తో మూవీని ప్రారంభించ‌క ముందే ఈ చిత్రం పై భారీ బజ్ ఏర్పడింది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి నేపథ్యంలో కథ ఉంటుందని తెలిసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతుంది.. ఈ సినిమాలో ఓ కోలీవుడ్ హీరో నటించనున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ కోలీవుడ్ హీరో ఎవ‌రో కాదు.. కార్తి. ఆ పాత్రను చేసేందుకు కార్తి కూడా ఆసక్తి చూపించాడని స‌మాచారం.

అయితే.. ప్రచారంలో ఉన్న వార్త పై అటు రాజ‌మౌళి కానీ.. ఇటు కార్తి కానీ స్పందించలేదు. అదే విధంగా హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెతో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ క్రేజీ మూవీ గురించి వార్త‌లు వ‌స్తుండ‌డంతో అఫిషియ‌ల్ అప్ డేట్స్ కోసం మ‌హేష్ ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై జ‌క్క‌న్న క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : డ్రీమ్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్