Rajamouli for Radhe… పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను మేకర్స్ క్రమ క్రమంగా పెంచేస్తున్నారు. అందుకు తగినట్లు ఎలిమెంట్స్‌ను యాడ్ చేసుకుంటూ వెళుతున్నారు. ఐదు భాషల్లో సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ సినిమాకు నెరేషన్‌ను ఒక్కో సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క సెలబ్రిటీతో చెప్పించడం విశేషం.
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ హిందీ వెర్షన్ నెరేషన్‌ను వాయిస్ ఓవర్‌ను పూర్తి చేశారు. ఇప్పుడు మరో స్టార్ తెలుగు వెర్షన్ వాయిస్ ఓవర్‌ను పూర్తి చేశారు. ఆ స్టార్ ఎవరో కాదు.. తెలుగు సినిమా సత్తాను బాహుబలితో ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. రీసెంట్‌గానే ఆయన తన వర్క్ ను పూర్తి చేశారు. మరి మిగతా భాషల్లో నెరేషన్‌ను ఇచ్చిన ప్రముఖులెవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
‘రాధే శ్యామ్’ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్ రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద భారీ బడ్జెట్‌తో రూపొందించారు. దాదాపు రెండున్నరేళ్ల దాటిన తర్వాత సిల్వర్ స్క్రీన్ పై విడుదలవుతున్న ప్రభాస్ చిత్రమిది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ భారీ పీరియాడిక్ మూవీని మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా విడుదల చేయనున్నారు.
Also Read : ప్రభాస్ ‘రాధే శ్యామ్’కి బిగ్ బి వాయిస్ ఓవర్