Saturday, January 18, 2025
Homeసినిమామ‌హేష్ మూవీలో రాజ‌శేఖ‌ర్?

మ‌హేష్ మూవీలో రాజ‌శేఖ‌ర్?

Angry in Young Movie: సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. అత‌డు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న సినిమా ఇది. 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఈ క్రేజీ కాంబినేష‌న్లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఆగ‌ష్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర ఉంది. ఆ పాత్ర‌ను బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అనిల్ క‌పూర్ తో చేయించ‌నున్నార‌ని టాక్ వినిపించింది. మీడియాలో కూడా వార్త‌లు రావ‌డంతో మ‌హేష్ మూవీలో అనిల్ క‌పూర్ క‌న్ ఫ‌ర్మ్ అనుకున్నారు. ఆత‌ర్వాత అనిల్ క‌పూర్ ఈ మూవీ న‌టించ‌డం లేద‌ని తెలిసింది. తాజా వార్త ఏంటంటే… సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ని ఆ పాత్ర కోసం కాంటాక్ట్ చేశార‌ని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

రాజ‌శేఖ‌ర్ మంచి పాత్ర అయితే.. వేరే హీరో సినిమాల్లో న‌టిస్తాన‌ని ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు వేరే హీరో సినిమాలో న‌టించ‌లేదు. ఆమ‌ధ్య గోపీచంద్ మూవీలో రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ మూవీ నుంచి త‌ప్పుకున్నారు. దీంతో మ‌హేష్ మూవీలో రాజ‌శేఖ‌ర్ అనే వార్త బ‌య‌ట‌కు రాగానే ఇది నిజ‌మా కాదా అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల పై మేక‌ర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read మ‌హేష్ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న త్రివిక్ర‌మ్. ? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్