Saturday, January 18, 2025
Homeసినిమా45 ఏళ్లుగా నేను నమ్ముకుంది నవ్వునే: రాజేంద్రప్రసాద్

45 ఏళ్లుగా నేను నమ్ముకుంది నవ్వునే: రాజేంద్రప్రసాద్

RP- Comedy : వెంకటేశ్ – వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3‘ సినిమాను రూపొందించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27వ తేదీన థియేటర్లకు వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ వదిలిన బాణీలు ఇప్పటికే సందడి చేస్తున్నాయి. తమన్నా .. మెహ్రీన్ తో పాటు, సోనాల్ చౌహన్ .. పూజ హెగ్డే గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాద్ – శిల్పకళావేదికలో నిర్వహించారు. ‘ఎఫ్ 2’ సినిమాలోనే కాదు .. ఈ సినిమాలోను రాజేంద్రప్రసాద్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ మాట్లాడారు.

“ఈ సమాజంలో ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టుగా ఎవరి సమస్యలు వాళ్లకి ఉన్నాయి . ఇక బయట వాతావరణం పరంగా కూడా వేడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటినీ మరిచిపోయి కాసేపు హాయిగా నవ్వుకోవలసిన అవసరం ఉంది. అలా నవ్వుకోవాలనుకునే వారికి అత్యవసరమైన సినిమా ‘ఎఫ్ 3’. నవ్వు జీవితానికి ఎంత అవసరమనేది చెప్పే సినిమా ఇది. నవ్వును గురించి మాట్లాడే హక్కు ఇక్కడ నాకు మాత్రమే ఉంది. ఎందుకంటే  45 సంవత్సరాలుగా నేను నమ్ముకున్నది నవ్వునే కాబట్టి.

ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి  చివరివరకూ నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు. ప్రధానమైన పాత్రల నుంచి చివరి పాత్ర వరకూ మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. అలా ఈ కథను తీర్చిదిద్దిన అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రతి పాత్రకు ఒక మేనరిజం పెట్టేసి నవ్వించడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ మధ్య కాలంలో ఇంతమంది కమెడియన్స్ తో ఇలాంటి ఒక సినిమా రాలేదు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఈ  సినిమా హిట్ కాకపోతే మళ్లీ మీ ముందు నిలబడను” అంటూ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్