Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్, చరణ్‌... ఇద్దరిలో గెలిచేది ఎవరు?

ఎన్టీఆర్, చరణ్‌… ఇద్దరిలో గెలిచేది ఎవరు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మన దేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అద్భుతంగా నటిస్తే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించారు. ఇంకా చెప్పాలంటే.. ఈ రెండు పాత్రల్లో ఎన్టీఆర్, చరణ్‌ నువ్వా..? నేనా..? అనేట్టుగా పోటీపడి నటించి మెప్పించారు. ఈ సంచలన చిత్రం ఇప్పటికే గోల్డన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకుంది. అలాగే ఆస్కార్ బరిలో నిలిచి చరిత్ర సృష్టించింది.

అయితే.. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా పై ఇందులో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమెరూన్ రాజమౌళితో పాటు హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి అభినందనలు అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ ఇప్పడు ఆస్కార్ కు అడుగు దూరంలో నిలబడింది. ఇదిలా వుంటే.. యుఎస్ లో జరగనున్న క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో యాక్షన్ మూవీ కేటగిరీలో ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, చరణ్ నామినేట్ అయ్యారు.

ఈ అవార్డుల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు కోసం నువ్వా నేనా అనే స్థాయిలో పోటీపడుతున్నారు. హాలీవుడ్ స్టార్స్  టామ్ క్రూజ్- బ్రాడ్ పిట్ – నికోలస్ కేజ్ వంటి క్రేజీ హాలీవుడ్ స్టార్స్ తో ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఈ అవార్డుల ఫలితాలు మార్చి 16న తెలుస్తాయి. దీంతో.. బెస్ట్ యాక్టర్ పోటీలో రామ్ చరణ్ అవార్డుని దక్కించుకుంటాడా? లేక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంతం చేసుకుంటాడా? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్