Sunday, January 19, 2025
Homeసినిమాస‌ల్మాన్ మూవీలో వెంకీ, చ‌ర‌ణ్‌

స‌ల్మాన్ మూవీలో వెంకీ, చ‌ర‌ణ్‌

ఒక హీరో సినిమాలో మ‌రో హీరో గెస్ట్ రోల్ చేయ‌డం అనేది అప్పుడ‌ప్పుడు జ‌రుగుతుంటుంది. ఇటీవ‌ల క‌మ‌ల్ హాస‌న్ మూవీ ‘విక్ర‌మ్’ లో హీరో సూర్య గెస్ట్ రోల్ చేయ‌డం.. ఆ రోల్ కి అనూహ్యమైన స్పంద‌న రావ‌డం తెలిసిందే. ఇక‌ బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్‘ లో గెస్ట్ రోల్ చేశారు. లూసీఫ‌ర్ మూవీకి రీమేక్ గా వ‌స్తున్న ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుంది. ఇందులో చిరు, స‌ల్మాన్ క‌లిసి ఓ స్పెష‌ల్ సాంగ్ లో కూడా న‌టించ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ హిందీలో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర చేస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో స‌ల్మాన్ ఖాన్, వెంక‌టేష్ ల పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ గెస్ట్ రోల్ చేస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ బ‌య‌ట‌పెట్టారు. ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు సెట్ కి వెళ్లిన చ‌ర‌ణ్‌.. మీ ఇద్ద‌రితో క‌లిసి న‌టించాల‌ని ఉంది అన్నాడ‌ట‌. చ‌ర‌ణ్ ఏదో స‌ర‌దాగా అన్నార‌నుకున్నార‌ట‌ స‌ల్మాన్. త‌ర్వాత రోజు చ‌ర‌ణ్ ఆ సినిమాలో న‌టించేందుకు సెట్ కి వ‌చ్చాడ‌ట‌. అలా చ‌ర‌ణ్ గెస్ట్ లో న‌టించాడ‌ని.. వెంకీ, చ‌ర‌ణ్ తో క‌లిసి న‌టించ‌డం మ‌ర‌చిపోలేని అనుభ‌వం అంటూ స‌ల్మాన్ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్