Saturday, January 18, 2025
Homeసినిమామెగా ఫ్యాన్స్ లో అదే టెన్షన్!

మెగా ఫ్యాన్స్ లో అదే టెన్షన్!

ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిందంటే, ఆ సినిమా థియేటర్స్ కి వచ్చేవరకూ జనం నోళ్లలో నానుతూ ఉండాలి. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలను గురించి మాట్లాడుకునేలా చేస్తూ ఉండాలి. సినిమా విడుదలకి కొన్ని రోజుల ముందు ప్రమోషన్స్ మొదలుపెట్టడం మామూలే. అయితే చరణ్ తాజా చిత్రమైన ‘గేమ్ ఛేంజర్’ గురించిన అప్ డేట్స్ ఆశించిన స్థాయిలో రాకపోవడం మెగా అభిమానులకు అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ సినిమా పనులకు సంబంధించిన విషయాలు తెలియకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ ఒక సినిమా చేస్తున్నాడంటే అది ఎప్పుడు పూర్తవుతుందనే విషయాన్ని చెప్పడం కష్టమనే టాక్ ఉంది. బడ్జెట్ విషయంలో ఆయనను తట్టుకుని నిలబడటం కూడా కష్టమని చెప్పుకుంటూ ఉంటారు. ఇక చిత్రీకరణ పరంగా ఆయన చాలా సమయం తీసుకుంటారు. అయితే నిర్మాతగా దిల్ రాజు స్టైల్ వేరు. తన సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో ఆయనకి ముందునుంచి ఒక క్లారిటీ ఉంటుంది. అందువలన ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ముందుగా అనుకున్న ప్రకారమే జరగొచ్చని అంతా అనుకున్నారు.

అయితే దిల్ రాజు కూడా వెయిట్ చేయవలసిన పరిస్థితినే ఉంది. ఈ సినిమా షూటింగు ఎంతవరకూ వచ్చింది? ఎప్పుడు పూర్తవుతుంది? అనే విషయంలో అభిమానులకు ఒక క్లారిటీ మాత్రం రావడం లేదు. ఈ ప్రాజెక్టు ఇంకా ఆలస్యం అవుతుందేమోననే టెన్షన్ వాళ్లలో ఉంది. ఇక టైటిల్ విషయంలో అసంతృప్తి ముందు నుంచే వినిపిస్తోంది. కియారా అద్వాని కథనాయికగా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్ లో ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. దిల్ రాజు కెరియర్లో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్