Ram Charan Gave Voice For His Cousin Varun Tejs Gani :
మెగా ప్రిన్స్ గా ప్రేక్షకాభిమానులను మెప్పిస్తోన్న కథానాయకుడు వరుణ్‌తేజ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం `గని`. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే… మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ దీనికి వాయిస్ ఓవర్ అందించడం అందరినీ ఆకట్టుకుంటుంది.
“ప్రతి ఒక్కడి కథలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి
కోరికలుంటాయి.. కోపాలుంటాయి..కనపడితే గొడవలుంటాయి
అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కడికీ చాంపియన్ అయిపోవాలన్న ఆశ ఉంటుంది
కానీ విజేతగా నిలిచేది ఒక్కడే..
ఆ ఒక్కడు నువ్వే ఎందుకవ్వాలి.. వై యు..
ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్ లో ఉంటావు.
కానీ గెలిస్తే మాత్రమే చరిత్రలో ఉంటావు”
అంటూ వరుణ్ తేజ్ యాక్షన్ లుక్‌కి రామ్ చరణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అలాగే ‘గని’ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
సిద్ధు ముద్ద మాట్లాడుతూ “డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీ కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. ఆయన లుక్‌ను చూస్తే ఆయన పడ్డ కష్టమేంటో తెలుస్తుంది. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం విదేశాలకు వెళ్లి బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేయడం విశేషం. తెలుగు ఆడియెన్స్ కు ఓ సరికొత్త ఎక్స్ పీరియెన్స్ ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించాం” అన్నారు.
Also Read : హాలీవుడ్ మాస్టర్స్ తో ‘గని’ యాక్షన్ పార్ట్