Saturday, January 18, 2025
Homeసినిమాగౌత‌మ్ సినిమాపై చరణ్ పునరాలోచన?

గౌత‌మ్ సినిమాపై చరణ్ పునరాలోచన?

రామ్ చ‌ర‌ణ్,  డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.   దిల్ రాజు ఈ భారీ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ఫాస్ట్ గా షూటింగ్ జ‌రుపుకుంది. అయితే.. శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్ రీస్టార్ట్ చేయ‌డంతో చ‌ర‌ణ్ మూవీకి బ్రేక్ ప‌డింది. దీంతో.. చ‌ర‌ణ్ గౌత‌మ్ తిన్న‌నూరితో మూవీ చేయ‌నున్నార‌ని టాక్ వ‌చ్చింది.

జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి చ‌ర‌ణ్ కి క‌ధ చెప్ప‌డం.. చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఎప్పుడో జ‌రిగింది. ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి రానుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. గౌతమ్ తిన్ననూరి మరో హీరో కోసం చూస్తున్నాడని… ఇటీవల ఒక యంగ్ హీరోకు ఆయన కథ చెప్పేందుకు వెళ్లాడంటూ టాలీవుడ్ లో టాక్ వినిపించింది. రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయిన తర్వాత మరో హీరోకు కథ చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

హిందీ జెర్సీ విడుదల అయిన తర్వాత రామ్ చరణ్ నిర్ణయంలో మార్పు వచ్చిందని.. గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయడం వల్ల పాన్ ఇండియా మార్కెట్ ఉండక పోవచ్చు అని చరణ్ భావిస్తున్నాడట. అందుకే రామ్ చరణ్ ప్రస్తుతానికి గౌతమ్ తిన్ననూరిని హోల్డ్ లో పెట్టడంతో చేసేది లేక మరో హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్. అయితే.. ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మే కాదా అనేది తెలియాల్సివు

Also Read : ‘విక్రమ్’కు…చరణ్-శంకర్ సినిమాకు లింక్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్