నిన్ను కోరి, మజిలీ ఈ రెండు చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి అటు ఆడియన్స్ లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు శివ నిర్వాణ. ఆతర్వాత తెరకెక్కించిన చిత్రం టక్ జగదీష్. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇక ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితిలో చేసిన సినిమా ఖుషి. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. ఇటీవల ఖుషి సినిమా థియేటర్లో రిలీజైంది. ఫస్ట్ డే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. అయితే.. ఖుషి హవా ఒక వారానికి మించి కొనసాగలేదు.
ఈ సినిమా పై శివ నిర్వాణ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత పెద్ద స్టార్ తో సినిమా చేయాలి అనుకున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలి అనుకున్నాడట. కథ చెప్పాలని ప్రయత్నం చేస్తే.. ఆశించిన రెస్పాన్స్ రాలేదట. అంటే.. కథ వినకుండానే నో చెప్పాడన్నమాట. దీంతో మళ్లీ మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరితో అంటే.. నితిన్, శర్వానంద్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్.. వీళ్లల్లో ఎవరో ఒకరితో సినిమా చేయాలి అనుకుంటున్నాడట.
అయితే.. నాగచైతన్యతో కూడా సినిమా చేయాల్సివుంది. ప్రస్తుతం నాగచైతన్య.. చందూ మొండేటితో సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఈలోపు శివ నిర్వాణ.. వేరే హీరోతో సినిమా చేస్తాడో.. లేకపోతే నాగచైతన్య కోసం వెయిట్ చేస్తాడో చూడాలి.