Friday, May 9, 2025
Homeసినిమాబాబాయి ట్రైలర్ పవర్ ఫుల్ గా ఉందన్న చరణ్

బాబాయి ట్రైలర్ పవర్ ఫుల్ గా ఉందన్న చరణ్

Electrifying: ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, క్రేజీ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కిన భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయక్ ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరుతుతోంది. మొన్న విడుదలైన ట్రైలర్ రికార్డులతో దూసుకుపోటింది.

ఈ ట్రైలర్ లోని సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాపై అంచనాలను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఈ ట్రైలర్ గురించి రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘భీమ్లా నాయక్ ట్రైలర్ ఎలక్ట్రిఫయింగ్. పవన్ కళ్యాణ్‌ గారి డైలాగులు, యాక్షన్ పవర్ ఫుల్. రానా దగ్గుబాటి పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్’ అంటూ భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ గురించి ప్ర‌శంసించాడు. ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. సెన్సేషన‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్ సంగీతాన్ని అందించారు.

Also Read : అది భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్: మంత్రి

RELATED ARTICLES

Most Popular

న్యూస్