Saturday, January 18, 2025
Homeసినిమామరో మూవీకి చరణ్‌ గ్రీన్ సిగ్నల్?

మరో మూవీకి చరణ్‌ గ్రీన్ సిగ్నల్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో అందరినీ మెప్పించాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ల లిస్ట్ లో చేరిపోయాడు. ఈ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని చరణ్ ఇక నుంచి అన్నీ పాన్ ఇండియా  చేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చరణ్‌ 15వ చిత్రం చేస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సమ్మర్ లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమాతో పాటు  ‘ఉప్పెన’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో  మరో మూవీకి రామ్ చరణ్ ఓకే చెప్పిన  విషయం తెలిసిందే.  మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఇది  రూపొందుతోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ మూవీలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

అయితే.. ఈ ప్రాజెక్ట్ కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు కన్నడ డైరెక్టర్ నర్తన్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి. బుచ్చిబాబుతో ప్రాజెక్ట్ ప్రకటించడంతో నర్తన్ ప్రాజెక్ట్ పక్కన పెట్టారని ప్రచారం మొదలైంది. అయితే.. చరణ్‌, నర్తన్ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టలేదని.. ఈ సినిమా కూడా ఉందని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించి ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీలో చరణ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారని.. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మించనున్నట్టు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్