Tuesday, September 17, 2024
HomeసినిమాSkanda Trailer: 'స్కంద' రిలీజ్ ట్రైలర్ టాక్ ఏంటి..?

Skanda Trailer: ‘స్కంద’ రిలీజ్ ట్రైలర్ టాక్ ఏంటి..?

రామ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘స్కంద’. అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 28న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా వస్తుండడంతో ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత వరకు మెప్పిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో కరీంనగర్ లో స్కంద రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు.

రిలీజ్ ట్రైలర్ విషయానికి వస్తే.. ”నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో చూడను” ”రింగ్ లో దిగితే రీసౌండ్ రావాలె…చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం.” అంటూ ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగులు పవర్ ఫుల్ గా వున్నాయి. ఇంకా చెప్పాలంటే.. రామ్ మ్యాసియస్ట్ యాక్షన్, బోయపాటి హైవోల్టేజ్ ఇంటెన్స్ సీక్వెన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో రిలీజ్ ట్రైలర్ మాస్ రాంపేజ్ క్రియేట్ చేసింది. ఇందులో మాస్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయని తెలియచేసింది. థమన్ నేపధ్య సంగీతం యాక్షన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. మొత్తానికి రిలీజ్ ట్రైలర్ స్కంద పై అంచనాలని మరింతగా పెంచింది.

ఈ రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లో రామ్ పోతినేని మాట్లాడుతూ..  ఇది వరకే ఈ సినిమా  ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. స్పెషల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్ నిర్వహించడం ఆనందంగా వుంది. ఇక్కడికి వచ్చిన టీం అందరికీ థాంక్స్. బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ అని అంటారు. అయితే.. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. ఆ ఫైట్స్ వెనుక ఎమోషన్. ఆ ఎమోషన్ ని ఎలా బిల్డ్ చేస్తారనేది స్కంద కీ ఎలిమెంట్. స్కంద కేవలం మాస్ సినిమానే కాదు. చాలా అందమైన ఫ్యామిలీ ఎలిమెంట్స్ వున్నాయి. ఈ సినిమాకి సోల్ ఫ్యామిలీ ఎమోషన్స్. బోయపాటి గారు ప్రతి సినిమాలో ఒక సోషల్ మెసేజ్ పెడతారు. ఇందులో మెసేజ్ ని కుటుంబ సభ్యులంతా ఎంజాయ్ చేస్తారు. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 28న థియేటర్స్ లో కలుద్దాం’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్