Sunday, January 19, 2025
HomeసినిమాSkanda Trailer: ‘స్కంద’ ట్రైలర్ రిలీజ్..

Skanda Trailer: ‘స్కంద’ ట్రైలర్ రిలీజ్..

రామ్ పోతినేని నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ‘స్కంద’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న అడియన్స్ ముందుకు రానుంది. తెలుగుతోపాటు… తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హజరయ్యారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బాలకృష్ణ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో రామ్ మరో లెవల్లో చూపించారు డైరెక్టర్ బోయపాటి. అంతేకాకుండా మరోసారి మాస్ అడియన్స్ కు ఫుల్ మీల్స్ కు ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చేస్తుంటే.. బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. తియ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలి అంటూ రామ్ చెప్పే డైలాగ్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్