Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్‌ ఆ మూవీకి నో చెప్పాడా..?

చరణ్‌ ఆ మూవీకి నో చెప్పాడా..?

రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తుండడం విశేషం. ఈ రెండు పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ క్యారెక్టర్స్ ని డిజైన్ చేశారని తెలిసింది. ఇటీవల వైజాగ్, హైదరాబాద్, కర్నూలులో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. శ్రీకాంత్, అంజలి, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందనుంది. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటించనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. శంకర్ తో చేస్తున్న మూవీ తర్వాత ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. అయితే.. చరణ్‌ ఓ సినిమాను క్యాన్సిల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాను అంటే.. కన్నడ డైరెక్టర్ నర్తన్ తో ఓ సినిమా చేయాలి.

గత కొంతకాలంగా చరణ్‌, నర్తన్ కాంబో మూవీ గురించి వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కన్ ఫర్మ్ అయ్యిందని కూడా టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది. అయితే.. నర్తన్.. శివ రాజ్ కుమార్ తో భైరతి రణగల్ అనే సినిమాను చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చరణ్‌ తో నర్తన్ మూవీ క్యాన్సిల్ అయ్యిందని.. చరణ్‌ నర్తన్ చెప్పిన స్టోరీకి సంతృప్తి చెందకపోవడంతో నో చెప్పారని ప్రచారం జరుగుతుంది. అయితే.. వాస్తవం ఏంటంటే.. చరణ్‌, శంకర్, బుచ్చిబాబుతో సినిమాలు చేస్తుండడంతో బాగా టైమ్ పడుతుందని.. అందుచేత ఈ గ్యాప్ లో శివ రాజ్ కుమార్ తో సినిమా చేసి వస్తానని చెప్పారట. అంతే కానీ.. చరణ్‌, నర్తన్ మూవీ క్యాన్సిల్ కాలేదని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్