Saturday, January 18, 2025
Homeసినిమాచాలామంది హీరోలు నో చెప్పారు .. కానీ రానా చేశాడు!

చాలామంది హీరోలు నో చెప్పారు .. కానీ రానా చేశాడు!

He is Great: సాయిపల్లవి ప్రధాన పాత్రధారిగా ‘విరాటపర్వం సినిమా రూపొందింది. రానా కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను,  సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ  సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. సురేశ్ బొబ్బిలి ఈ సినిమాకి  సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ‘ఆత్మీయ వేడుక’ను నిన్నరాత్రి వరంగల్లో నిర్వహించారు.

ఈ వేదికపై సాయిపల్లవి మాట్లాడుతూ .. “వరంగల్ వస్తే నాకు నా ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. నన్ను మీ ఇంటి ఆడపిల్ల మాదిరిగానే ఆదరిస్తున్నారు.  1990లలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. సమాజం కోసమే కాదు .. ప్రేమపై కూడా పోరాడే కథ ఇది. ఇలాంటి ఒక సినిమాలో నేను భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రయోగాలు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అయితే మీరు ఆదరిస్తేనే ఇలాంటి ప్రయోగాలు మళ్లీ మళ్లీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో నాకు ఇంతమంచి రోల్ ఇచ్చిన వేణు గారికి థ్యాంక్స్ చెబుతున్నాను” అన్నారు.

ఇక రానా మాట్లాడుతూ .. “ఎవరైనా సరే విజిల్స్ .. చప్పట్ల కోసమే సినిమాలు చేస్తారు. థియేటర్లో కూర్చుని ‘ఇది నిజమే కదా’ అని ఆలోచన చేసే ఒక్కడి కోసం నేను ఈ సినిమా చేశాను” అని చెప్పారు.

ఇక దర్శకుడు వేణు మాట్లాడుతూ .. ” 1990 లలో జరిగిన ఒక వ్యక్తి మరణం నన్ను కదిలించి వేసింది. అప్పుడే అనుకున్నాను ఆ సంఘటనను సినిమాగా తెరకెక్కించాలని. ఈ పాత్ర ఎలా ఉండాలనేది నాకు ఒక కల కూడా వచ్చేది. ఈ సినిమా సాయిపల్లవి చేస్తుందని నేను అనుకోలేదు. ఆమె ఒప్పుకోవడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. హీరోయిన్ కథలో భాగమయ్యే పాత్రలను చేయడానికి సాధారణంగా హీరోలెవరూ ముందుకురారు. చాలామందిని సంప్రదించినా నో చెప్పారు. కానీ రానా తాను ఈ పాత్రను చేస్తానంటూ ముందుకు వచ్చారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు  తెలియజేస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.

Also Read : ‘విరాటపర్వం’కథ సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుందట! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్