ఆ మధ్య రానా వరుస సినిమాలు చేస్తూ వెళ్లాడు. ‘బాహుబలి’ తరువాత ఆయన తన దూకుడును గట్టిగానే చూపించాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను నటించాడు. ‘బాహుబలి 2’ తరువాత కూడా ఆయన ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజయాలను అందుకున్నాడు. ఆ తరువాత కూడా ఆయన అదే జోరును కొనసాగిస్తూ వెళ్లాడు. కానీ సక్సెస్ మాత్రం ఆయనతో దోబూచులాడుతూనే ఉంది. అంతకుముందు మాదిరిగా ఆయనకి భారీ విజయాలు దక్కలేదు.
ఈ నేపథ్యంలోనే క్రితం ఏడాది ఆయన నుంచి ‘భీమ్లా నాయక్’ .. ‘విరాటపర్వం’ వచ్చాయి. ‘విరాటపర్వం’ థియేటర్లకు .. ఓటీటీలకు మధ్య ఊగిసలాడుతూ చాలా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ‘భీమ్లా నాయక్’ రీమేక్ .. పైగా పవన్ క్రేజ్ తోడుకావడంతో ఆ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. రానా కెరియర్లో ఈ హిట్ కూడా యాడ్ అవుతుంది. అయినా ఆ తరువాత ప్రాజెక్టును ఆయన ఇంతవరకూ సెట్ చేసుకోకపోవడం ఆశ్చర్యమే.
రానాకి గల నేపథ్యం .. ఆయనకి గల పరిచయాలను బట్టి చూసుకుంటే, వరుస ప్రాజెక్టులను సెట్ చేసి సెట్స్ పైకి తీసుకుని వెళ్లగల సమర్థుడు అనే విషయం అర్థమవుతుంది. పోనీ నిన్నమొన్నటి వరకూ ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ చేస్తూ వచ్చాడు గదా అంటే, గ్యాపులో ఇతర ప్రాజెక్టులను సెట్ చేసుకునే సమయం లేకుండానైతే పోదు. ఇక ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ కూడా ఆయనకి విమర్శలనే తెచ్చిపెట్టింది. ఈ సమయంలో ఆయనకి పెద్ద హిట్ కావాలి .. కానీ ఆయన వైపు నుంచి ఆలస్యమవుతోంది. అందుకు కామరణమేమిటనేదే అభిమానులను అయోమయానికి గురిచేస్తోంది.