Sunday, November 24, 2024
HomeTrending Newsరాణి రుద్రమ,దరువు ఎల్లన్న అరెస్ట్

రాణి రుద్రమ,దరువు ఎల్లన్న అరెస్ట్

బిజెపి నేతలు రాణి రుద్రమ, దరువు ఎళ్లన్నలను ఈ రోజు అరెస్ట్ చేసిన హైదరాబాద్  హయత్ నగర్ పోలీస్ లు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో నాగోల్ బండ్లగుడ లో ఏర్పాటు చేసిన అమరుల యాది సభలో తెలంగాణ సీఎం కెసిఆర్ మరియు ప్రభుత్వ పథకాలను కించపరిచే విధంగా స్కిట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.

ముఖ్యమంత్రి కెసిఆర్ ను అవమానపరిచే విధంగా స్కిట్ ఉందని తెరాస సోషల్ మీడియా విభాగం నేతలు ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఇదే కేసులో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ కి 41a crpc కింద నోటీస్ ఇచ్చిన హయత్ నగర్ పోలీస్ లు. ఇదే విషయంలో గత నాలుగు రోజుల క్రితం అర్థరాత్రి జిట్టా బాలకృష్ణను అరెస్ట్ చేసిన పోలీస్ లు… అయితే అదే రోజు జిట్టా బాలకృష్ణ రెడ్డి బేయిల్ పై విడుదల అయ్యారు.

Also Read : బిజెపి నేతలపై తెరాస సోషల్ మీడియా ఫిర్యాదు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్