Sunday, January 19, 2025
Homeసినిమాబాహుబలి కోసం రాశీ ఖన్నా ఆడిషన్ ఇచ్చిందా.?

బాహుబలి కోసం రాశీ ఖన్నా ఆడిషన్ ఇచ్చిందా.?

బాహుబలి.. తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం. అంతే కాకుండా.. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. రాజమౌళి సత్తాను ప్రపంచానికి తెలియచేసింది. అయితే.. ఈ సంచలన చిత్రంలో కథానాయికగా అనుష్కతో పాటు7 తమన్నా కూడా నటించింది. అయితే.. తమన్నా చేసిన పాత్ర కోసం ఆడిషన్స్ చేశారట. ఆ ఆడిషన్స్ కి అందాల రాశీ.. రాశీ ఖన్నా కూడా వెళ్లి ఆడిషన్ ఇచ్చిందట కానీ.. జక్కన్న రాశీని ఫైనల్ చేయలేదు. ఈ విషయాన్ని ఇప్పుడు రాశీఖన్నా బయటపెట్టింది.

ఇంతకీ ఏం చెప్పిందంటే… రాజమౌళి తన కొత్త చిత్రం కోసం హీరోయిన్ ని చూస్తున్నారు అన్న విషయం తెలుసుకుని హైదరాబాద్ వచ్చిందట రాశీ ఖన్నా. రాజమౌళి నిర్వహించిన ఆడిషన్ కి అటెండ్ అయ్యిందట కానీ.., రాజమౌళికి ఆమె నచ్చలేదు. తన అనుకున్న పాత్రకు ఈ బబ్లీ బ్యూటీ సరిపోదు అని రాజమౌళి భావించారు. అయితే.. తన మిత్రుడు సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఊహలు గుస గుసలాడే సినిమాలో అవకాశం కోసం ప్రయత్నించు అని సలహా ఇచ్చారట రాజమౌళి. ఆ తర్వాత రాజమౌళి తమన్నాని హీరోయిన్ గా తీసుకున్నారు.

అలా.. తనకు బాహుబలి సినిమాలో నటించే అవకాశం మిస్ అయిందని చెప్పింది రాశీ ఖన్నా. తమన్న పాత్ర దక్కి ఉంటే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చేది అనుకుంటోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. తెలుగులో ఇటీవల నటించిన థ్యాంక్యూ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఆమె నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో జోరు తగ్గింది. మరి.. హిందీలో బిజీ అయ్యి మళ్లీ తెలుగులోకి వస్తుందేమో ఈ అందాల రాశీ.

RELATED ARTICLES

Most Popular

న్యూస్