Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: గుజరాత్ జోరు-చెన్నైపై గెలుపు

ఐపీఎల్: గుజరాత్ జోరు-చెన్నైపై గెలుపు

Gujarath going on: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ మరో విజయం నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ తో నేడు జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో చివరి ఓవర్లో విజయం సాధించి సత్తా చాటింది. గెలుపు కోసం గుజరాత్ కు చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు కావాల్సిన దశలో క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్లో రషీద్ ఖాన్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి, 19వ ఓవర్లో రషీద్ ఖాన్ ఔటైనా చివరి ఓవర్లో మిల్లర్ రాణించి మరో బంతి మిగిలి ఉండగానే గెలిపించాడు. చివరి ఓవర్ నాలుగో బంతికి మిల్లర్ అవుట్ అయినా అది నోబాల్ కావడంతో చెన్నై ను దురదృష్టం వెంటాడింది. డేవిడ్ మిల్లర్ 51బంతుల్లో 8 ఫోర్లు, 6సిక్సర్లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలవగా, హార్దిక్ పాండ్యా స్థానంలో కెప్టెన్ గా బాధ్యత చేపట్టిన  రషీద్ బ్యాటింగ్లో 21 బంతుల్లో 2ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు

పూణేలోని ఎంసిఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై ఏడు పరుగులకే తొలి వికెట్ (ఊతప్ప-3) కోల్పోయింది. జట్టు స్కోరు 32 వద్ద మొయిన్ అలీ (1) కూడా ఔటయ్యాడు. ఈ దశలో మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్- అంబటి రాయుడుతో కలిసి మూడో వికెట్ కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాయుడు 46; గైక్వాడ్ 48 బంతుల్లో 5 ఫోర్లు  5 సిక్సర్లతో 73 పరుగులు చేసి ఔటయ్యారు. శివమ్ దూబే-19; కెప్టెన్ జడేజా -22 చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.

గుజరాత్ 16 పరుగులకే మూడు వికెట్లు (శుభమన్ గిల్- డకౌట్; విజయ్ శంకర్ డకౌట్; అభినవ్ మనోహర్-12) కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా-­11; రాహుల్ తెవాటియా-6 కూడా విఫలమైన దశలో మిల్లర్, రషీద్ ఆదుకొని జట్టును విజయ తీరాలకు చేర్చారు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు; మహీష తీక్షణ రెండు; ముఖేష్ చౌదరి, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

డేవిడ్ మిల్లర్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : ఐపీఎల్: రాహుల్ సెంచరీ – లక్నో విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్