Sunday, January 19, 2025
Homeసినిమాపుష్ప నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదల

పుష్ప నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదల

‘అల వైకుఠ‌పురంలో’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ‘ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌ డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. సెప్టెంబర్ 29 ఉదయం 9.45 నిమిషాలకు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదలైంది. క్రిస్మస్ సందర్భంగా పుష్ప: ది రైజ్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్