Sunday, January 19, 2025
HomeసినిమాVijay-Rashmika: విజయ్ తో డేటింగ్ గురించి రష్మిక రియాక్షన్!

Vijay-Rashmika: విజయ్ తో డేటింగ్ గురించి రష్మిక రియాక్షన్!

సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ హీరోయిన్ రష్మిక  కలిసి ‘గీత గోవిందం’లో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ కోసం మరోసారి తాజా కట్టారు కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు.  అయితే వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

వీరిద్దరూ కలిసి హాలీడే కి వెళ్లడం… విజయ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రష్మిక హాజరవ్వడం, విజయ్ బ్రదర్ ఆనంద్ దేవరకొండ సినిమాకు రష్మిక ప్రమోషన్స్ చేయడం చూసి.. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని ఫిక్స్ అయ్యారు. ఇదే విషయమై గతంలో రష్మిక స్పందిస్తూ “ఫ్రెండ్స్ అన్నాక.. కలిసి టూర్ కి వెళుతుంటాం. విజయ్ నాకు మంచి ఫ్రెండ్ అతనితో కలిసి టూర్ కి వెళితే తప్పేంటి” అని అడిగింది.  ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా విజయ్ తో లవ్ గురించి మరోసారి రష్మిక సోషల్ మీడియాలో స్పందించింది.  ‘రష్మిక, విజయ్ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని..  వారు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటున్నారం’టూ  ట్విట్టర్ లో  ఒక నెటిజన్ తాజాగా పోస్ట్ చేశారు. దానికి వెంటనే రష్మిక  రెస్పాండ్ అయ్యింది. “అయ్యో దయచేసి ఓవర్ గా ఊహించుకోకండి బాబు” అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చింది. రష్మిక సెటైరికల్ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి మా మధ్య ఏమీ లేదు అంటుంది కానీ.. వారిద్దరి మధ్య ఏదో సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి.. విజయ్ కూడా స్పందిస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్