భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. బంగారు పుష్పాలతో… ఆలయ అర్చకులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. స్వయంభూ దర్శనానంతరం ఆలయ ముఖపండంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చతుర్వేద ఆశీర్చవనం చేశారు. ఆలయ చరిత్రను వివరించేలా మాడ వీధుల్లో ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కొండపైకి భక్తులను ఎవరినీ అనుమతించడం లేదు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన ద్రౌపది ముర్ము ఆధ్యాత్మిక, సేవా, విద్యా కార్యాక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ద్రౌపది ముర్ము రాక సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 1,200 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొన్ని గంటల పాటు దర్శనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
Also Read: రాష్ట్రపతికి గవర్నర్, సిఎం ఘన స్వాగతం