Sunday, January 19, 2025
Homeసినిమాప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లో.. హిలేరియస్ క్యారెక్ట‌ర్ లో.. రాశీ ఖన్నా

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లో.. హిలేరియస్ క్యారెక్ట‌ర్ లో.. రాశీ ఖన్నా

Important Character: యాక్ష‌న్ హీరో గోపీచంద్‌తో యూత్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించిన చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా నుంచి రాశీ ఖన్నా లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడానికి రెడీ అయ్యారు రాశీ. ఈమె కారెక్టర్ ఎంత ఫన్నీగా ఉండబోతుందో.. మొన్న విడుదలైన ట్రైలర్‌తోనే అర్థమై ఉంటుంది.

సినిమాలో దీనికి మించి ఫన్ ఉంటుందంటున్నారు మేకర్స్. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాశారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్