Saturday, January 18, 2025
Homeసినిమా‘రావణాసుర’ థర్డ్ సింగిల్ మార్చి 15న విడుదల

‘రావణాసుర’ థర్డ్ సింగిల్ మార్చి 15న విడుదల

రవితేజ, సుధీర్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర‘ తో వస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రవితేజ మల్టీ షేడ్ క్యారెక్టర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో కలిసి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు మంచి ఆదరణ పొందాయి. ఈ చిత్రంలోని మూడవ సింగిల్- వెయ్యినొక్క జిల్లాల వరకు లిరికల్ వీడియో మార్చి 15న విడుదల కానుంది.

అనౌన్స్ మెంట్ పోస్టర్ ఇది రెట్రో నేపథ్య పాట అని సూచిస్తుంది. రవితేజ, మేఘా ఆకాష్ ఇద్దరూ స్కూటర్‌పై కూర్చొని రెట్రో కాస్ట్యూమ్స్‌లో కలర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా యూనిక్ కథను అందించారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ప్రపంచ వ్యాప్తంగా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కానుంది.

Also Read : ‘రావణాసుర’గా రవితేజ తన మార్క్ కి దూరంగా వెళ్లాడా?  

RELATED ARTICLES

Most Popular

న్యూస్