రవితేజ నుంచి పెద్దగా గ్యాప్ లేకుండా సినిమాలు వస్తూనే ఉంటాయి. అనుకోకుండా ఏమైనా అవాంతరాలు వస్తే తప్ప, ఆయన నుంచి వచ్చే సినిమాల సంఖ్య విషయంలో లెక్క తప్పదు. ఫ్లాప్ .. హిట్ అనే ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన తన సినిమాలను చేస్తూ వెళుతూనే ఉంటాడు. అలా ఈ ఏడాది కూడా ఆయన నుంచి వరుసగా సినిమాలు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో అవి ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఆయన నుంచి వచ్చిన మూడు సినిమాల్లో ‘రావణాసుర’ .. ‘టైగర్ నాగేశ్వరరావు’ పూర్తిగా నిరాశపరిచాయి.
‘రావణాసుర’ కంటెంట్ రవితేజ మార్క్ నుంచి పూర్తిగా పక్కకి వెళ్లిపోయిందనే టాక్ వచ్చింది. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ మాత్రం తప్పకుండా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. భారీ బడ్జెట్ … భారీ తారాగణంతో ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. చాలామంది సీనియర్ ఆర్టిస్టులు తెరపై కనిపించారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ కనిపించకపోయినా, కథ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేకపోయింది. దాంతో రవితేజ నుంచి ఈ ఏడాది మరో ఫ్లాప్ వచ్చింది.
అయితే అంతమంది గొప్ప ఆర్టిస్టులు ఉన్న ఆ సినిమానే కంటెంట్ పరంగా కూర్చోబెట్టడం కష్టమై పోయింది. కానీ ఆ స్థాయి తారాగణం లేని ‘ఈగల్’ సినిమా ఎంతవరకూ భారీతనాన్ని ఆవిష్కరించగలదు? అనేదే రవితేజ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. రవితేజ లుక్ .. పోస్టర్స్ .. టీజర్ డైలాగ్ ఇవన్నీ కూడా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. అయినా రవితేజ స్థాయికి తగిన సపోర్టింగ్ రోల్స్ .. వాటిని డిజైన్ చేరవి సిన తీరు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి ఈ సినిమాను తీసుకొస్తున్న రవితేజ, కొత్త ఏడాదిని ఈ సినిమా హిట్ తో మొదలుపెడతాడేమో చూడాలి.రవి రవి