Sunday, January 19, 2025
HomeసినిమాRavi Teja: బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్న రవితేజ!

Ravi Teja: బాలీవుడ్ మూవీ ప్లాన్ చేస్తున్న రవితేజ!

కొంతకాలం వరుస ఫ్లాఫులు ఎదుర్కొన్న మాస్ మహారాజా రవితేజ ‘ధమాకా’ తో మళ్ళీ ట్రాక్ పైకి వచ్చారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో వచ్చిన ధమాకా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సాధించింది.  వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ నటించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలా  రెండు వరుస  సక్సెస్ లు సాధించిన రవితేజ  తాజాగా ‘రావణాసుర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

రవితేజ ఇప్పుడు బాలీవుడ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. ముఖ్యంగా హిందీ దర్శకులు, నిర్మాతలు సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. అలాగే  సౌత్ దర్మక నిర్మాతలు హిందీ స్టార్స్ తో మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఓ విధంగా ఇది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి మార్పు అని చెప్పచ్చు. చిరు గాడ్ ఫాదర్ మూవీలో సల్మాన్ ఖాన్ నటించారు. బ్రహ్మాస్త్రంలో నాగార్జున నటించారు. ఇప్పుడు సల్మాన్ మూవీలో వెంకీ నటిస్తుంటే.. చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.

రవితేజ, బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రానా తన కొత్త ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ మూవీని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నిర్మిస్తారని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్