Sunday, January 19, 2025
Homeసినిమామెగా154 లో రవితేజ మెగా మాస్ ఎంట్రీ

మెగా154 లో రవితేజ మెగా మాస్ ఎంట్రీ

Mass Entry: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ మెగా154 మెగా ఫోర్స్‌తో మాస్ ఫోర్స్‌ కలసి మరింత క్రేజీయెస్ట్‌గా మారింది. మెగా154లో పవర్ ఫుల్, లెంగ్తీ రోల్ ప్లే చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు లోడ్ అవుతోంది. చిరంజీవి, రవితేజ మాస్ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న మెగా మాస్ అభిమానులకు ఇది పండగ లాంటి వార్త. చిరంజీవి, రవితేజ కలసి తెర పై సందడం చేయడం అభిమానులకు కన్నుల పండగ.

అనౌన్స్ మెంట్ వీడియోలో రవితేజ కారు పై సెట్‌లోకి రావడం, చిరంజీవిని విష్ చేయడం, తర్వాత ఎనర్జిటిక్ గా కారవాన్‌లోకి వెళ్ళడం అభిమానులని అలరించింది. ”అన్నయ్యా” అని రవితేజ పిలవగానే, చిరు రిప్లైగా ” హాయ్ బ్రదర్, వెల్‌కమ్ ”అని రవితేజ చేయి అందుకొని కారవాన్‌లోకి ఆహ్వానించడం మెగా మాస్ మూమెంట్ గా నిలిచింది. చివర్లో దర్శకుడు బాబీ “మెగా మాస్ కాంబో ఎంటర్ ” అంటూ మెగా మాస్ ఫ్యాన్స్ ని థ్రిల్ చేశారు. మాస్ తో పెట్టుకుంటే, శంకర్ దాదా ఎంబిబిఎస్ పాటలు మిక్స్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం వీడియోకి మరింత మాస్ ఎనర్జీని నింపింది. వీరిద్దరూ స్క్రీన్ పై ఎలాంటి మాస్ మ్యాజిక్ ని చూపించబోతున్నారో ఈ వీడియోని చూస్తే అర్ధమౌతుంది. ఈ ప్రాజెక్ట్ పై ఉన్న ఉత్సాహం రవితేజ ఎంట్రీతో రెట్టింపైయ్యింది.

మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ, రవితేజ డాన్ శీను, బలుపు చిత్రాలకు రచయితగా పని చేశారు. పవర్ సినిమాతో బ్లాక్ బస్టర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. తన ఫేవరేట్ స్టార్, ఫస్ట్ సినిమా హీరోతో ఒకే ప్రాజెక్ట్‌లో పనిచేయడం దర్శకుడికి కల నిజమైనట్లయింది. ఈ సినిమాని ఇద్దరి అభిమానులకు పూనకాలు ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నాడు. అన్ని కమర్షియల్ హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు, పలువురు ప్రముఖ నటీనటులు పని చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పని చేస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా మెగా154 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read సంక్రాంతికి ‘మెగా154’ గ్రాండ్ రిలీజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్