రాయలసీమకు జరిగిన నష్టాన్ని దేశం వినేలా చాటి చెబుదామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా కర్నూలు ఎస్టీబిసి మైదానంలో జేఏసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే రాయల సీమ గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రజలు కడలి వచ్చారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రాయలసీమ అభివృద్దిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేస్తున్న సిఎం జగన్ అన్నారు.
న్యాయ రాజధాని కర్నూలుకు ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పుడు రాదని సిద్దార్థ రెడ్డి పేర్కొన్నారు. పాలన వికెంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధాని, హైకోర్టు, హెల్త్ సిటీ, ఐటీ సిటీ, టూరిజం హబ్, శివరామకృష్ణ కమిటీలు ఇచ్చిన నివేదికను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో స్టడీ చేసి భవిష్యత్ లో ఆయా ప్రాంతాలు వెనుకపడి పోకూడదని పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ సాయి కిషోర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ, మండల కన్వీనర్ సుధాకర్ రాజు పాల్గొన్నారు.