Saturday, November 23, 2024
HomeTrending Newsకనీస మద్దతు ధర అందించాలి: సిఎం ఆదేశం

కనీస మద్దతు ధర అందించాలి: సిఎం ఆదేశం

RBKs – MSP: రైతులందరికీ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కచ్చితంగా అందించిడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. పంటల కొనుగోళ్లలో, ఎంఎస్‌పీ లభించేలా చూడడంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే)లు క్రియాశీల పాత్ర పోషించాలని సూచించారు. ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం అధికారులకు పలు సూచనలు చేశారు.

⦿ రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు
⦿ ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదు, రచుగా రైతులతో ఇంటరాక్ట్‌ అవ్వాలి
⦿ రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవు
⦿ రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం
⦿ ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు, కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి
⦿ ధాన్యం నాణ్యతా పరిశీనలో రైతులు మోసాలకు గురికాకూడదు
⦿ ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలి
⦿ దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది
⦿ ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలి:
⦿ టెక్నికల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలి
⦿ ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి
⦿ వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్‌అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి
⦿ గన్నీబ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలి
⦿ వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు
⦿ ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి
⦿ పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలి
⦿ అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి
⦿ ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారా? లేదా? చూడండి
⦿ కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరుపై పరిశీలన చేయండి
⦿ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లండి
⦿ పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్‌ ఏర్పాటు చేయాలి
⦿ ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలి

ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధనరెడ్డి, సివిల్‌ సఫ్లైస్‌ కమిషనర్‌ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీ ఎస్‌ ప్రద్యుమ్న,  సివిల్‌ సఫ్లైస్‌ డైరెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, సివిల్‌ సఫ్లైస్‌ ఎండీ జీ వీరపాండ్యన్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : రామతీర్థం ఆలయానికి ఎల్లుండి శంకుస్థాపన

RELATED ARTICLES

Most Popular

న్యూస్