Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ఢిల్లీపై బెంగుళూరు విజయం

ఐపీఎల్: ఢిల్లీపై బెంగుళూరు విజయం

IPL-2022:  బెంగుళూరు ఆటగాళ్ళు గ్లెన్ మాక్స్ వెల్, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్ మెరుపు ఇన్నింగ్స్ తో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలంజర్స్ బెంగుళూరు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్య సాధనలో ఢిల్లీ ఆటగాళ్ళు డేవిడ్ వార్నర్, కెప్టెన్ రిషభ్ పంత్ మినహా మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగుళూరు 13 పరుగులకే రెండు వికెట్లు (అర్జున్ రావత్ డకౌట్, డూప్లెసిస్-5) కోల్పోయింది. కోహ్లీ మరోసారి విఫలమై 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. సుయాష్ ప్రభుదేశాయ్ (6) కూడా త్వరగా ఔటయ్యాడు. గ్లెన్ మాక్స్ వెల్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు. దినేష్ కార్తీక్- షాబాజ్ అహ్మద్ ఆరో వికెట్ కు అజేయమైన 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా దినేష్ కార్తీక్ మరోసారి సిక్సర్లు, ఫోర్లతో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి 34 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లతో 66; షాబాజ్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 32 పరుగులు చేశారు. బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ 50 పరుగుల వద్ద తొలి వికెట్ (పృథ్వీషా-16) కోల్పోయింది…. 38  బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసిన వార్నర్ స్కోరు 94 వద్ద రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత  కెప్టెన్ పంత్ ఒక్కడే 34 తో చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. మిచెల్ మార్ష్14); పావెల్(డకౌట్) ; లలిత్ యాదవ్(1) విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్-17; అక్షర్ పటేల్-10; కుల్దీప్ యాదవ్-10 పరుగులు చేశారు, ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికేట్లకు 173 పరుగులు చేసింది.

బెంగుళూరు బౌలర్లలో హాజెల్ వుడ్ మూడు; సిరాజ్ రెండు; హసరంగ ఒక వికెట్ పడగొట్టారు.

దినేష్ కార్తీక్ కు ‘ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : ఐపీఎల్: కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్