Sunday, February 23, 2025
HomeTrending Newsకాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద

కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద

ఎగువన భారీ వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులోని బ్యారేజీలకు రికార్డు స్థాయిలో నమోదైంది. మేడిగడ్డ బ్యారేజీలోకి 22,15,760 క్యూసెక్కుల ప్రవాహం వచ్చిచేరుతున్నది. దీంతో లక్ష్మీ బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు తెరిచి వరద నీటిని వదులుతున్నారు. ఇక అన్నారం సరస్వతీ బ్యారేజీకి 14,77,975 క్యూసెక్కుల నీరు వస్తుండగా అధికారులు అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలేస్తున్నారు.
కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. త్రివేణి సంగమం వద్ద 15.90 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తున్నది. దీంతో మహాదేవపూర్‌, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. పుష్కరఘాట్లను ముంచెత్తిన వరద నీరు సమీపంలోని ఇళ్లలోకి చేరింది. ముంపు ప్రాంతాల్లో నివాసాలను అధికారులు ఖాళీ చేయించారు. కాళేశ్వరం ఘాట్‌ వద్దకు ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్