Thursday, March 28, 2024
HomeTrending Newsఖరీఫ్ కు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

ఖరీఫ్ కు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

వానాకాలం సాగుకు నిజాంసాగర్ ఆయకట్టుకు రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు నీరు విడుదల చేస్తామని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. మొత్తం 6 విడతలుగా నీరు విడుదల చేస్తామన్నారు. ఈరోజు బాన్సువాడ లోని తన నివాసంలో రేవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన స్పీకర్ రేపటి మొదటి విడతలో 1200 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుందన్నారు. మొదటి విడత 20 రోజులు, తరువాత 5 విడతలను 10 రోజుల చొప్పున విడుదల చేస్తామని చెప్పారు.

నియోజకవర్గ పరిదిలోని రైతులు ఇప్పటికే బోర్లు, బావుల కింద నార్లు పోసుకున్నారని, నార్లు ముదరక ముందే నీటిని విడుదల చేస్తే రైతులు నాట్లు వేసుకుంటారని స్పీకర్ చెప్పారు. నిజాంసాగర్ ఆయకట్టులో ఒక పంట సాగుకు 9 TMC ల నీళ్ళు అవసరమని, ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 6. 13 TMC ల నీరు ఉన్నదన్నారు. వానాకాలం వర్షాలు పడుతాయి కనుక అంతగా ఇబ్బందులు ఉండవని, అత్యవసరమైతే సింగూరు నుంచి, కొండపోచమ్మ సాగర్‌ల ద్వారా కూడా నీళ్ళు అందుతాయన్నారు.

ప్రస్తుతం నిజాంసాగర్ లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని స్పీకర్ రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. రైతులు తమ వంతు బాద్యతగా నీటిని పొదుపుగా, అవసరమైన వరకే వాడుకోవాలి, వృదా చేయవద్దన్నారు. కాలువల పై బాగంలో ఉన్న రైతులు నీటిని వృదా చేయకుండా పర్యవేక్షణ అవసరమని, ప్రతి డిస్ట్రిబ్యూటరీ వద్ద VRA, VRO, గ్రామ పోలీసు అధికారి, లష్కర్ లతో కూడిన టీం ను కాపలా ఉంచాలని అధికారులను ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీకి ఎంత నీరు కెటాయిస్తే అంత మేరకే విడుదల చేయాలని స్పష్టం చేశారు. బాన్సువాడ, బోదన్ RDO లు, DSPలు, CIలు, సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్