Monday, September 23, 2024
HomeTrending Newsబాలయోగి పేరు తొలగించడం సరికాదు

బాలయోగి పేరు తొలగించడం సరికాదు

Its not fair: సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న గురుకుల విద్యా సంస్థలకు బాలయోగి పేరు తొలగించడం సరికాదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. లోక్ సభ స్పీకర్ గా బాలయోగి జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని, దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని బాబు అన్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే… దానికి బాలయోగి పేరు తొలగింఛి పెట్టాల్సిన అవసరం లేదని…. వైఎస్, జగన్ పేరుతో ఉన్న పథకాల పేర్లు తొలగించి వాటికి డా. అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు. అంబేద్కర్ పై అంత ప్రేమ ఉంటె కొత్త జిల్లాల్లో ఒక్క దానికి కూడా ఎందుకు ఆ మహనీయుడి పేరు పెట్టలేదని బాబు ప్రశ్నించారు. తెలుగు జాతి గ‌ర్వప‌డే ద‌ళిత బిడ్డ బాల‌యోగి పేరును తొల‌గించ‌డం వైసీపీ ప్రభుత్వ కుసంస్కారం అని బాబు విమర్శించారు.

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న రెసిడెన్షియల్ విద్యా సంస్థల పేరు మారుస్తూ ప్రభుత్వం మొన్న శుక్రవారం జీవో విడుదల చేసింది. లోక్ సభ మాజీ స్పీకర్ గంటి మోహన చంద్ర బాలయోగి పేరుతో ఉన్న ఈ సంస్థల పేరు డా. అంబేద్కర్ గురుకులాలుగా  మారుస్తూ నిర్ణయం తీసుకుంది.  దీనిపై టిడిపి శ్రేణులు కోనసీమలోని దళిత సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్