Saturday, January 18, 2025
Homeసినిమా సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు ఇక లేరు

 సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు ఇక లేరు

Great Editor:  ప్ర‌ముఖ‌ సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు ఈరోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 68 సంవ‌త్స‌రాలు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. అపోలో హాస్ప‌ట‌ల్ లో చికిత్స చేయించుకుని మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే.. ఒక్కసారిగా అర్ధరాత్రి ఆయ‌న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1:30 నిమిషాలకు మరణించారు. ఇది టాలీవుడ్ కి షాక్ అని చెప్ప‌చ్చు.

ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌సింగ్‌, కిక్‌, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్‌, బలుపు, ఊసరవెల్లి, బద్రీనాథ్‌.. ఇలా 800 కు పైగా చిత్రాల‌కు పైగా ఎడిటర్‌గా పని చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పని చేశారు. గౌతమ్‌రాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్