Sunday, January 19, 2025
HomeTrending Newsరాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి… తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతిపిత మహాత్మాగాంధీ ,బాబాసాహెబ్ అంబెడ్కర్ గార్ల చిత్ర పటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆయా జిల్లాల అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి .

మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహబూబాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ శశాంక గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ కవిత జాతీయ జెండాను ఎగరవేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా కలెక్టరేట్ లో గణతంత్ర వేడుకలు జరిగాయి. కలెక్టర్ కార్యాలయ అవరణలో కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే జాతీయ జెండాను ఎగురవేశారు.

నల్లగొండ జిల్లా: మునుగోడులోని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

నారాయణపేట: కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈవేడుకల్లో జడ్పీ చైర్ పర్సన్ వనజమ్మ, ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జనగామ జిల్లా: 74 వ గణతంత్ర దినోత్సవం సంధర్బంగా జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రిన్సిపల్ జడ్జీ కె శైలజ, డిసిపి సీతారాం, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, అధికారులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా: రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా కరీంనగర్ ఉత్తర తెలంగాణ భవన్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వరంగల్ జిల్లా: గణతంత్ర దినోత్సవం సందర్బంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి కలెక్టరేట్ లో జాతీయ పతకాన్ని ఎగుర వేశారు.

సిద్దిపేట జిల్లా: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ములుగు జిల్లా: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జాతీయ జెండాను ఆవిష్కరించారు.

నాగర్ కర్నూలు జిల్లా: కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకల్లో ఎస్పీ మనోహర్, జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా: జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరీ కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి సందేశాన్ని చదివి వినిపించారు.

కరీంనగర్ జిల్లా: రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కలెక్టరేట్ లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జాతీయ జెండా ఎగరవేశారు. ఇరుకు స్థలంలో సాదా సీదాగా ఈ వేడుకలు జరిగాయి.

గద్వాల జిల్లా: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలో జిల్లా కలెక్టర్ క్రాంతి జాతీయ జెండాను ఎగురవేశారు.

సంగారెడ్డిజిల్లా: కలెక్టరేట్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ శరత్ జాతీయ జెండాని ఆవిష్కరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్