Tuesday, January 21, 2025
HomeTrending Newsకాంగ్రెస్ నేతల అరెస్టులు... రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం

కాంగ్రెస్ నేతల అరెస్టులు… రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ హౌజ్ అరెస్టు అనంతరం.. పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన ఇంటికి వచ్చి అడ్డుకోవడం ఏంటీ అని ప్రశ్నించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తిరగొద్దా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలపడానికి కూడా హక్కు లేదా అని అడిగారు.

తాను ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా అనుమతి కావాలా అని రేవంత్ రెడ్డి అన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సర్పంచులకు తెలియకుండా రూ.35వేల కోట్లు దారి మళ్లించారన్న రేవంత్ రెడ్డి… 8ఏళ్లు పూర్తయినా అమరవీరుల స్థూపం పూర్తి కాలేదని ఆరోపించారు. అసలు తనను ఏ బేసిస్ మీద అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన్ను పోలీసులు బలవంతంగా పోలీసుల జీపులోకి ఎక్కించుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగా పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకుల ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. వారిని గృహ నిర్బంధం చేశారు. అంతేకాదు.. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సర్పంచ్ ల ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడం, ముందస్తు అరెస్టులకు నిరసనగా జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తు నిరసనలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి నిరాకరించినా ధర్నా చేస్తామని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీపీసీసీ ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ డీసీసీ ప్రెసిడెంట్స్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్