Sunday, January 19, 2025
HomeTrending Newsఢిల్లీలో ఇల్లు వదలని కెసిఆర్ - రేవంత్ విమర్శ

ఢిల్లీలో ఇల్లు వదలని కెసిఆర్ – రేవంత్ విమర్శ

కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అంశంపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అధిక వర్షాలు వరదాలుగా మారాయని ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యం బీభత్సం సృష్టించిందని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలని ఆ దిశగా చర్యలు కనిపించటం లేదని విమర్శించారు.

వరద నష్టంపై నివేదికలు తయారు చేయాలని, సీఎం కేసీఆర్ రాజకీయ కారణాలతో స్వార్ధం కోసం ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. వరదల వల్ల రాష్ట్రంలో 3 వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు మాకు సమాచారం ఉందని, రాష్ట్రప్రభుత్వం 1400 ల కోట్ల నష్టం అంటూ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. సీఎం ఢిల్లీకి వచ్చి మూడు రోజులు అయిందని, ప్రదానిపై ఒత్తిడి తెచ్చి నిధులు తెస్తారు అనుకుంటే…ఢిల్లీలో స్వంత పార్టీ ఎంపిలకే టైమ్ ఇవ్వటం లేదని మండిపడ్డారు.

సిఎంకెసిఆర్ ఢిల్లీలో మూడు రోజులుగా ఇంటికే పరిమితం అయ్యారని, ప్రధాని, కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి ఇప్పటికి అపాయింట్మెంట్ అడగలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. మోడీ గుజరాత్  రాష్ట్రానికే ప్రధానమంత్రా అని విమర్శించారు. గుజరాత్ లో వరదలు వస్తే, వేల కోట్లు ఇస్తారని, తెలంగాణను కేంద్రం ఎందుకు పట్టించుకోదని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ఎంపీలు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయారని, కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు.

ఢిల్లీలో కేసీఆర్ ఎందుకు ఇళ్లు వదలడం లేదని, ప్రధానిని ప్రశ్నించడానికి సీఎం కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని రేవంత్ రెడ్డి అడిగారు. తెరాస ఎంపీలు మిగతా పక్షాల వెనుక దాక్కుని పోరాటం అని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఎంపిలు ఫోటోలకు ఫోజులిస్తున్నారని, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు తెలంగాణను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానిని కలుద్దాం అంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని, ప్రదానిపై కేసీఆర్ పోరాట కార్యాచరణ ను ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పోరాట కార్యాచరణ ప్రకటించాకే ఢిల్లీ నుంచి కదలాలని లేదంటే మీ అవినీతిని ప్రశ్నిస్తారనే ప్రదానిపై మార్లాడటం లేదని తెలంగాణ సమాజం భావిస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Alson Read : ఇసుక దోపిడీతో భద్రాచలం మునిగిపోయింది – రేవంత్ రెడ్డి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్