Monday, January 20, 2025
HomeTrending NewsRaithe Rajaithe: సంక్షేమ పాలన తీసుకొస్తాం - రేవంత్ రెడ్డి

Raithe Rajaithe: సంక్షేమ పాలన తీసుకొస్తాం – రేవంత్ రెడ్డి

వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక తరం.. ఒక అనుభవం..అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అత్యంత పిన్న వయసు 34 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడు అయ్యారన్నారు. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా, డాక్టర్ కెవిపి రామచంద్రరావు, సిడబ్ల్యుసి సబ్యులు డాక్టర్ రఘువీరారెడ్డి రూపొందించిన *రైతే రాజైతే వ్యవసాయం పండుగే* పుస్తకావిష్కరణ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం రైతే రాజు పుస్తకాన్ని మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్ర రావు, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి , పాలగుమ్మి సాయినాథ్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, సిపిఐ నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ,చిన్నారెడ్డి, కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన పునాదులే కాంగ్రెస్ ను నడిపిస్తున్నాయన్నారు. సీఎం కావడానికి ఆయన 20ఏళ్ళు ఎదురుచూశారన్నారు. వైఎస్ అనుభవాలు, రాజకీయంగా వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు అందరికీ ఆదర్శనీయమని, ఆయన సీఎం గా ఉన్నప్పుడు విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై చిరునవ్వుతో సమాధానం ఇచ్చేవారని గుర్తు చేశారు.

వైఎస్ ఒక గొప్ప నాయకుడు… ఆదర్శనీయుడు…అని రేవంత్ రెడ్డి కొనియాడారు. నూతన సభ్యులను ఆయన ఎంతో ప్రోత్సహించేవారని, 21శతాబ్దంలో వైస్ ఒక్కరే.. ఆయన ఆశయాలను కొనసాగించిన నేత కేవీపీ ఒక్కరే అన్నారు. మళ్లీ ఈ తరంలో అలాంటి నాయకులను చూడలేమని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకోస్తామని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ సంక్షేమ పాలనను తీసుకొస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్