Friday, October 18, 2024
HomeTrending Newsసవాళ్ళను అధిగమిస్తా...తొలి ప్రసంగంలో రిషి సునాక్

సవాళ్ళను అధిగమిస్తా…తొలి ప్రసంగంలో రిషి సునాక్

ప్రధానిగా ఎన్నికయ్యేందుకు మద్దతు సాధించానని… ఇక దేశ ప్రజల నమ్మకం నిలబెట్టుకుంటానని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆ దేశ ప్రజలను ఉద్దేశించి… 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి రిషి సునాక్‌  తన తొలి ప్రసంగం చేశారు. ఇది నా జీవితంలో గొప్ప అవకాశం.. బ్రిటీష్‌ ప్రజలకు అను నిత్యం సేవ చేస్తానని పేర్కొన్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తన శక్తిమేర పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ దేశానికి సేవ చేసేందుకు తన జీవితంలో లభించిన అతి పెద్ద గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ప్రస్తుతం మన దేశం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ నేపథ్యంలో మనకు స్థిరత్వం, ఐక్యత కావాలన్నారు. యూకేను ఏకతాటిపైకి తీసుకురావడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని సునాక్ స్పష్టం చేశారు. ప్రస్తుత సవాళ్లను అధిగమించి, భవిష్యత్‌ తరాలను గొప్పగా నిర్మిస్తానని చెప్పారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా తనను ఎన్నుకున్న తమ పార్టీ ఎంపీలు, నేతలకు మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని రిషి సునాక్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత..ఆసియా సంతతి నేతగా నిలిచారు. హిందూ మతస్తుడైన రిషి సునాక్‌.. అధికార 357 మంది పార్టీ ఎంపీల్లో సగానికి పైగా ఎంపీల మద్దతు కూడగట్టుకున్నారు.  లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేయడంతో తిరిగి బ్రిటన్‌ ప్రధాని ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీని ప్రకారం సోమవారం మధ్యాహ్నం రెండు గంటల్లోపు నామినేషన్ దాఖలు చేయాలని గడువు విధించారు. అయితే, కనీసం 100 మంది ఎంపీల మద్దతు ఉంటేనే బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీ పడాల్సి ఉంటుంది. కేవలం 27 మంది ఎంపీల మద్దతు మాత్రమే లభించడంతో పెన్నీ మోర్డాంట్‌ పోటీ నుంచి వైదొలిగారు.

Also Read : బ్రిటన్ చరిత్రలో నవశకం ప్రధానిగా రిషి సునాక్

RELATED ARTICLES

Most Popular

న్యూస్