Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్Road Safety World Series Cricket:  షెడ్యూల్ విడుదల

Road Safety World Series Cricket:  షెడ్యూల్ విడుదల

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ క్రికెట్ షెడ్యూల్ ను నేడు విడుదల చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేందుకు భారత ప్రభుత్వ రోడ్డు రవాణా-జాతీయ రహదారులు…. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ నిర్వహిస్తున్నారు.

గత ఏడాది మొదలైన ఈ టోర్నమెంట్ లో ఇండియా విజేతగా నిలిచింది. ఇండియా తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు పాల్గొన్నాయి, ఈ ఏడాది న్యూ జిలాండ్ టీమ్ కొత్తగా ఈ టోర్నీలో చేరింది. మొత్తం ఎనిమిది జట్లు ఆడుతున్నాయి.

సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1 వరకూ 22 రోజులపాటు దేశంలోని నాలుగు వేదికల్లో ఈ టోర్నీ జరగనుంది. కాన్పూర్ గ్రీన్ పార్క్  స్టేడియంలో ఇండియా-సౌతాఫ్రికా లెజెండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాన్పూర్ తో పాటు, ఇండోర్, డెహ్రాడూన్, రాయ్ పూర్ లలో మ్యాచ్ లు జరగున్నాయి, సెమీఫైనల్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కు కూడా రాయ్ పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా లెజెండ్స్ జట్టుకు సచిన్ టెండూల్కర్ నేతృత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

సెప్టెంబర్ 16, 20, 26, 30 తేదీల్లో ఈ టోర్నీకి విరామం ఉంటుంది.

మిగిలిన అన్ని రోజుల్లో మ్యాచ్ లు ఉంటాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్