I don’t do: తిరుమల శ్రీవారి దర్శనానికి తనతో పాటు తన గన్ మెన్ కూడా మహాద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారన్న వార్తలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. తనను అప్రదిష్ట పాలుజేసేందుకే ఓ పచ్చ మీడియా ఈ వార్తను ప్రసారం చేసిందని విమర్శించారు. తాను అలాంటి తప్పు ఎప్పుడూ చేయబోనని, తన వెంట ఉండేవారు కూడా చేయరని స్పష్టం చేశారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా విజయవాడ నగరంలో 22 దేవాలయాలను కూల్చినప్పుడు, కాళ్ళకు బూట్లు వేసుకొని పూజలు చేసినప్పుడు ఈ ఛానళ్ళు ఎందుకు కళ్ళు మూసుకున్నాయని రోజా ప్రశ్నించారు.
మొన్న తిరుపతిలో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమానికి కూడా ఎప్పటివో టిడిపి మీటింగ్ కు సంబంధించిన ఖాళీ కుర్చీలు చూపించి తన మీటింగ్ కు ఎవరూ రాలేదని వార్త ప్రసారం చేశారని రోజా ధ్వజమెత్తారు. తాము ఎలాంటి తప్పూ చేయకపోయినా ఏదో ఒక నింద వేసి చులకన చేయాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read : టైమ్ పాస్ పాలిటిక్స్ నమ్మరు: రోజా