Sunday, January 19, 2025
Homeసినిమారోషన్ హీరోగా వైజయంతీ మూవీస్ సినిమా

రోషన్ హీరోగా వైజయంతీ మూవీస్ సినిమా

Roshan in Vyjayanthi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా యంగ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తో ప్రొడక్షన్ నెం 9 చిత్రాన్ని ప్రకటించింది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ఈ ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.

ప్రదీప్ అద్వైతం విన్నింగ్ స్క్రిప్ట్ను రెడీ చేసాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో రోషన్ డిఫరెంట్ లుక్ లో కనిపించ నున్నాడు. ఈ సినిమాలో న‌టించ‌నున్న న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ వివరాలు త్వరలో తెలియనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్