Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్బెంగుళూరుకు మళ్ళీ నిరాశే: క్వాలిఫైర్ 2 కు రాజస్థాన్

బెంగుళూరుకు మళ్ళీ నిరాశే: క్వాలిఫైర్ 2 కు రాజస్థాన్

ఈసారి టైటిల్ సాధించాలన్న రాయల్ ఛాలెంజర్స్ కు ఈసారి కూడా నిరాశే మిగిలింది. నేడు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్లతో ఆర్సీబీ పై విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి క్వాలిఫైర్-2 కు చేరుకుంది.

లీగ్ దశలో మొదట్లో తడబడిన బెంగుళూరు చివర్లో పుంజుకొని వరుసగా ఆరు మ్యాచ్ లు విజయం సాధించి ప్లే ఆఫ్స్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే కీలక మ్యాచ్ లో ఆ జట్టు బ్యాట్స్ మెంట్ విఫలమయ్యారు. రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగుళూరు ఆటగాళ్ళలో  రజత్ పటీదార్ (34); విరాట్ కోహ్లీ(33); మహిపాల్ లామ్రోర్ (32); కామెరూన్ (27); కెప్టెన్ డూప్లెసిస్ (17) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. గ్లెన్ మాక్స్ వెల్ మరోసారి విఫలమై గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. నిర్ణీత 20 ఓవర్లల్లో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగలిగింది.

రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వరుస బంతుల్లో కామెరూన్ గ్రీన్, గ్లెన్ మాక్స్ వెల్ లను ఔట్ చేసి సత్తా చాటాడు. అతనికే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది. ఆవేష్ ఖాన్ 3; బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్ తలా ఒక వికెట్ సాధించారు.

రాజస్థాన్ తొలి వికెట్ (టామ్ కోహ్లెర్-20) కు 46 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్-45; రియాన్ పరాగ్-36; సంజూ శామ్సన్-17; సిమ్రాన్ హెట్మెయిర్-26 పరుగులు చేయగా చివర్లో రోమన్ పావెల్ 9 బంతుల్లో నాటౌట్ గా నిలిచి 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 16 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయం పూర్తి చేశాడు.

కోల్ కతా ఇప్పటికే ఫైనల్స్ కు చేరుకున్న సంగతి విదితమే.  శుక్రవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ లో ఫైనల్ బెర్త్ కోసం హైదరాబాద్- రాజస్థాన్ తలపడన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్