Sunday, January 19, 2025
HomeసినిమాRRR: జపాన్ లో చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'

RRR: జపాన్ లో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’

ఎన్టీఆర్, రామ్ చరణ్‌, రాజమౌళిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గోల్డన్ గ్లోబ్ అవార్డ్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఊహించని విధంగా ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ అందుకుని ఈ విభాగంలో ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఆసియాలోని మొదటి పాటగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. అయినా ప్రపంచంలోని ఏదో ఓ మూల ఈ చిత్రం ఇంకా థియేటర్స్‌లో విజయవంతంగా రన్ అవుతుండడం విశేషం.

అయితే.. చాలా రోజుల క్రితమే ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్‌ లో విడుదలైంది. ఆ సమయంలో రాజమౌళితో పాటు తారక్, చరణ్ అక్కడికి వెళ్లి మరి ప్రమోషన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ థియేటర్స్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శితమవుతూనే ఉంది. 164 రోజుల్లో ఈ మూవీని జపాన్‌లో 1 మిలియన్ ఫుల్ పాల్స్ ని రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని తెలుపుతూ రాజమౌళి ఓ ట్వీట్ చేశాడు.

రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా ఇప్పటి వరకు జపాన్ లో రికార్డ్ గా ఉండేది. ఆ రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ముత్తు రికార్డ్ ను బద్దలుకొట్టడానికి పాతకేళ్లు పట్టింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రికార్డ్ ను బద్దలు కొట్టడానికి కూడా పాతికేళ్లు పట్టచ్చు అంటున్నారు సినీ జనాలు. ఇంత ప్రేమ చూపించిన జపాన్ ఆడియన్స్ కి థ్యాంక్స్ అంటూ జక్కన్న జపనీస్ లోనే ట్వీట్ చేయడం విశేషం. ఇది అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటుంది.

Also Read : RRRకు అభినందనల వెల్లువ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్